+91 95819 05907

పథకాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

పథకాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​అట్టహాసంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 18: ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందాలని, ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయానికి తావులేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. బుధవారం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని, ఎవరైనా మధ్యవర్తులు ఆశ చూపిస్తే నమ్మవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధియే తన ధ్యేయమని, దమ్మపేట మండలంలోని ప్రతి పల్లెకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేరేలా అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, తహసీల్దార్ రామ్ నరేష్, ఆర్‌ఐలు సోయం భిక్షమయ్య, వంకా వీరస్వామి, జూనియర్ అసిస్టెంట్ ఎస్‌డి అలీ, జలీల్ పాషా మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం –

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17 కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More »

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం. అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను

Read More »

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

*పత్రికా ప్రకటన 18.02.2026* *👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..* *👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం

Read More »

సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ వారికి ప్రత్యేకమైన అభినందనలు :సిపిఎం

18/2/2026 సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ

Read More »

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం పినపాక పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేగా

Read More »

 Don't Miss this News !