కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17
కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో వేగంగా వైరల్ కావడంతో “హిందూ అమ్మాయికి మూడింది” అనే నిర్ధారణ లేని వదంతులు వ్యాప్తి చెందాయి.ఈ ప్రచారంతో కొంతమంది ప్రజల్లో ఆందోళన, అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేని సమాచారమేనని పోలీసులు స్పష్టం చేశారు. వేషధారణ ఆధారంగా అనుమానాలు వ్యక్తం చేయడం, సామాజిక మాధ్యమాల్లో నిర్ధారణ లేని వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.
కోరుట్ల పట్టణం ఎప్పటినుంచో మత సామరస్యానికి నిలయంగా ఉన్న ప్రాంతమని, ఇటువంటి అపోహలు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తాయని స్థానిక పెద్దలు పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.









