+91 95819 05907

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం:మంత్రి పొంగులేటి

🔺ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం
🔺తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి వ్యవ‌హారం
🔺అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు
🔺కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు

-రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు అన్నారు. ప్రజ‌ల ఆస్తుల ర‌క్షణ‌కు నిర్మించ‌వ‌ల‌సిన వ్యవ‌స్ధనే ఆనాటి ప్రభుత్వంలోని కొంత‌మంది ప్రముఖులు త‌మ స్వార్ధ ప్రయోజ‌నాల కోసం వాడుకున్నార‌ని మండిప‌డ్డారు.

ధ‌ర‌ణి పోర్టల్ లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను కొల్లగొట్టిన సంఘ‌ట‌న‌పై ఉన్నత స్ధాయి క‌మిటీతో విచార‌ణ జ‌రిపించ‌గా దిగ్బ్రాంతి క‌ర‌మైన అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని అన్నారు. ఇది సాధార‌ణ సాంకేతిక లోపం కాద‌ని వ్యవ‌స్ధాగ‌తంగా సృష్టించిన లోపాల ఫ‌లిత‌మ‌ని స్ఫష్టం చేశారు. బుధ‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో ఉన్నత‌స్ధాయి క‌మిటీతో మంత్రిగారు స‌మీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. ఆనాడు ధ‌ర‌ణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన స‌మ‌యంలో గుర్తించిన లోపాల‌ను స‌రిదిద్దకుండానే అంతా స‌వ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చార‌ని అలాగే మాన‌వ ప్రమేయంతో త‌ప్పులు చేసే విధంగా పోర్టల్ ను రూపొందించార‌ని, భూముల లావాదేవీల‌కు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల స‌మాచారం ల‌భించ‌కుండా లాగిన్‌లు డిలిట్ చేశార‌ని, అత్యంత ర‌హ‌స్యంగా ఉండ‌వ‌ల‌సిన లాగిన్ వివ‌రాలు లేకుండా పోయాయ‌ని ఉన్నత స్ధాయి క‌మిటీ విచార‌ణ‌లో ప్రాధ‌మికంగా గుర్తించ‌డం జ‌రిగిందని తెలిపారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిన భూలావాదేవీల స‌మాచారం ల‌భించ‌కుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో కోడ్ ఆడిట్ నిర్వహించ‌లేద‌న్న విష‌యం బ‌హిర్గత‌మైంద‌ని, ఈ నేప‌ధ్యంలో త‌క్షణ‌మే ధ‌ర‌ణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను టెర్రాసిస్ అనే విదేశీ సంస్దకు అప్ప‌గించ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు.

గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ధ‌ర‌ణి లోపాల‌ను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావ‌లసిన స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను కొల్లగొట్టిన వారిప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తామ‌ని, త‌ప్పుచేసిన‌వారు ఎవ‌రినైనా వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేద‌ని, ప్రభుత్వానికి రావ‌ల‌సిన ప్రతిపైసాను వ‌సూలు చేస్తామ‌న్నారు. దీనిపై ఉన్నత స్ధాయి క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌విష్యత్తులో అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఏ చిన్న లోపానికి తావులేకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజ‌ల‌కు ఫ్రెండ్లీగా ఉండేలా భూభార‌తి పోర్టల్ ను నిర్వహించాల‌ని అధికారుల‌కు సూచించారు.

ప్రజ‌ల భూముల విష‌యంలో ఎటువంటి రాజీ ప‌డ‌బోమ‌ని, ధ‌ర‌ణి పేరుతో జ‌రిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామ‌ని, సిరిసిల్ల‌, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ‌కు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్యద‌ర్శి లోకేష్ కుమార్ గారు, సిఎం ఆర్వో మందా మ‌క‌రంద్‌ గారు, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ఐజీ రాజీవ్ గాంధీ హ‌నుమంత్ గారు, ఉన్నత స్ధాయి క‌మిటీ స‌భ్యులు స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ డిఐజి సుభాష్‌ గారు, ఎస్‌బి ఎస్‌పీ సింధు శ‌ర్మ‌ గారు, సైబ‌ర్‌క్రైమ్ డిఎస్పీ ఎ. సంప‌త్‌ గారు, హోంశాఖ స‌ల‌హాదారు పి. శ‌ర‌త్‌కుమార్ గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం:మంత్రి పొంగులేటి

🔺ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం 🔺తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి వ్యవ‌హారం 🔺అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు 🔺కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

Read More »

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం –

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17 కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More »

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం. అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను

Read More »

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

*పత్రికా ప్రకటన 18.02.2026* *👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..* *👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం

Read More »

సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ వారికి ప్రత్యేకమైన అభినందనలు :సిపిఎం

18/2/2026 సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ

Read More »

 Don't Miss this News !