ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం.. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అండగా ఉంటామన్న గ్రామశ్రేణులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 19: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసినప్పటికీ, రాజకీయ ఫలితాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం మాత్రం చెక్కుచెదరలేదని కాసాని దంపతులకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే స్పష్టమవుతోంది. నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, పదవుల కంటే ప్రజాసేవే పరమావధిగా జీవిస్తున్న కాసాని చంద్రమోహన్ రావు మరియు పద్మ దంపతులకు సంఘీభావం తెలిపేందుకు వినాయకపురం గ్రామస్తులు కదలివచ్చారు. ముఖ్య నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తరలివచ్చిన గ్రామ పెద్దలు, యువకులు మరియు కార్యకర్తలు కాసాని నివాసంలో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ప్రజల కోసం నిలబడే ధైర్యం ఉన్న నాయకత్వం అశ్వారావుపేట ప్రాంతానికి ఎంతో అవసరమని, పదవులతో సంబంధం లేకుండా తామంతా ఒకే కుటుంబంలా కాసాని దంపతులకు వెన్నంటే ఉంటామని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రతినబూనారు. అండగా నిలిచే ప్రతి కార్యకర్తకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, భవిష్యత్తులోనూ ప్రజా పక్షాన గళం విప్పుతూనే ఉంటామని గ్రామస్తుల ధైర్యవచనాల పట్ల కాసాని చంద్రమోహన్ రావు దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీ స్థానిక రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీయడమే కాకుండా, సేవా దృక్పథం ఉంటే ప్రజలు ఎప్పటికీ అండగా ఉంటారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.








