అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత
పినపాక
అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి లో గాయాలతో కనిపించింది.వివరాలు… గురువారం ఉదయం ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త బోడ లక్ష్మణరావు ఇంటి ఆవరణలో అరుదైన గుడ్లగూబ గాయాలతో పడి ఉండడంతో, దానికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఏడుల్లా బయ్యారం ఫారెస్ట్ ఆఫీసులో అధికారులకు బోడ లక్ష్మణ్ అప్పగించడం జరిగింది.
Post Views: 44








