*.
మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19.
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ ప్రాజెక్టుకు వన్ టీఎంసీ నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు మేలు జరిగేలా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటీ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర నీటి కొరత ను ఎదుర్కొంటున్నారని తక్షణమే స్పందించి నీటీ విడుదల చేయాలని లేఖ రాశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించినందుకు రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యేసునీతా సునీత లక్ష్మారెడ్డి కి రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే మాసాయిపేట మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 46








