కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని ఆరోపించిన షబీర్ అలీ, దీంతో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరిన వెంకటరమణ రెడ్డి
వెంకటరమణారెడ్డి సవాల్ స్వీకరించి, అతని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తోపులాట
ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేసి, కారును బోల్తా పడేసిన బీజేపీ కార్యకర్తలు
పరిస్థితి అదుపుతప్పడంతో కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు








