US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు
నేటి గదర్ వెబ్ డెస్క్: సొంత కారు లేదని కోపంతో ఇతరుల కార్ల టైర్లను పొడిచి పైశాచిక ఆనందం పొంది చివరికి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. టెక్సాస్ నగరంలో పలు ప్రాంతాలలో పార్కింగ్ చేసిన కార్లను జీసస్ అనే యువకుడు కత్తితో టైర్లను పొడిచి వాటి గాలి తీశాడు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న టెక్సాస్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి విచారించారు. తనకు కారు లేదని కోపంతో ఈ సంఘటనకు పాల్పడినట్లు అగంతకుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Post Views: 6








