+91 95819 05907

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇనుము చోరీకి బాధపడుతున్న ఆ పార్టీ నాయకులు?

భద్రాద్రి #పినపాక ఈరోజు మధ్యాహ్నం అమ్మవారిపల్లి సమీపంలోని ఎల్ & టి స్టాఫ్ యార్డ్ వద్ద నుంచి అమ్మగారిపల్లికి చెందిన ఒక వ్యక్తి సుమారు రూ.80,000 విలువ చేసే ఇనుము సామాగ్రిని అక్రమంగా తరలిస్తుండగా అక్కడి సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌తో పాటు అతడిని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. సెక్యూరిటీ జనరల్ మేనేజర్ జాయింట్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మసాగర్ ప్రాంతంలో ఇనుపరాడ్ల దొంగతనం జరుగుతుండటానికి స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారుల అండదండలతోనే మెటీరియల్ మొత్తం దొంగిలించబడిందని కూడా ఆరోపిస్తున్నారు. పట్టుబడిన ఇనుపరాడ్ల లోడ్ బండిని ఇప్పటివరకు స్టేషన్‌కు తరలించకుండా బయటనే ఉంచి సెటిల్‌మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం ఒకలా, అధికార పార్టీ వారికి మరోలా వ్యవహరిస్తున్నారా? ప్రజా ఆస్తుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల సొమ్ముతో నిర్మితమవుతున్న సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు చెందిన ఇనుపరాడ్లు దొంగిలించడం అత్యంత గంభీరమైన విషయం అని, ఇందులో ఎవరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని రేగా కాంతారావు గారు తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా ఆస్తుల రక్షణలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరిస్తూ, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇనుము చోరీకి బాధపడుతున్న ఆ పార్టీ నాయకులు?

భద్రాద్రి #పినపాక ఈరోజు మధ్యాహ్నం అమ్మవారిపల్లి సమీపంలోని ఎల్ & టి స్టాఫ్ యార్డ్ వద్ద నుంచి అమ్మగారిపల్లికి చెందిన ఒక వ్యక్తి సుమారు రూ.80,000 విలువ చేసే ఇనుము సామాగ్రిని అక్రమంగా తరలిస్తుండగా

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మధిర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల .

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: చింతకాని మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త వేముల శ్రీనివాసరావు-సుగుణ దంపతుల కుమారుడు కిషోర్ -కావ్యశ్రీ.వివాహం కొదుమూరు జ్యోతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ వివాహానికి హాజరై

Read More »

ఏసీబీ కి పట్టుబడ్డ విద్యా శాఖ అధికారులు

ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ రూ.70,000/- డిమాండ్ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్

Read More »

ఐదు వేల రూపాయల కోసం ఆశపడి ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ వలలో పడ్డారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు

Read More »

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి ఖమ్మం పోలీస్

Read More »

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు నేటి గదర్ వెబ్ డెస్క్: సొంత కారు లేదని కోపంతో ఇతరుల కార్ల టైర్లను పొడిచి పైశాచిక ఆనందం

Read More »

 Don't Miss this News !