+91 95819 05907

వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు :సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ కొత్త యాకయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కొమ్ము లావణ్య వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి మురళి గారు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సభలో ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నీరు వృథా కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని సర్పంచ్ గారు వివరించారు. చెరువులు, బోర్లు, ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం పనులను గ్రామంలో మరింత వేగవంతంగా చేపట్టాలని నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనులు చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న కరెంట్ సమస్యలు, తరచూ ఎదురవుతున్న అంతరాయాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించాలని తీర్మానించారు.

వీధి దీపాల మరమ్మత్తులు, కొత్త దీపాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించారు.

బతుకమ్మ ఘాట్ ఏర్పాటు విషయంపై కూడా సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. మహిళలకు సౌకర్యంగా ఉండే విధంగా ఘాట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. గ్రామ అభివృద్ధి పనులు, నర్సరీలో మొక్కల పెంపకం, గ్రామంలో పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై కూడా స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు.

గ్రామ కార్యదర్శి మురళి గారు ప్రభుత్వ పథకాల అమలు విధానం, నిధుల వినియోగంపై వివరాలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకతతో ముందుకు సాగుతామని తెలిపారు.

గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సర్పంచ్ కొత్త యాకయ్య గారు పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య.

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల

Read More »

వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు :సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ కొత్త యాకయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కొమ్ము లావణ్య వార్డు సభ్యులు, గ్రామ

Read More »

అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు

పశువుల అక్రమ రవాణా పట్టివేత అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి మణుగూరు నుండి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టిడిపి

Read More »

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా ఓయూ ప్రాంగణంలో ఖాసీం ధర్నా నిర్వహించారని కేసులు నమోదు చేసిన పోలీసులు. ఈ కేసులను కొట్టివేయాలని

Read More »

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ◆ కారు అద్దాలు ధ్వంసం చేసిన బిజెపి కార్యకర్తలు?

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి,

Read More »

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు మంథని, అరుణ కిరణాలు క్రైమ్ ప్రతినిధి ఫిబ్రవరి 20: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు కు రెండున్నర గంటల భూమి

Read More »

 Don't Miss this News !