నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
పువ్వాడ ఉదయ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్ర కుమార్తె రమ్య వివాహం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలోని రామాలయం నందు శనివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వీరనారీమణుల ఆశయ సాధనా సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు భద్రు నాయక్, యాకేష్, రామకృష్ణ, నీలా, అమ్ములు, సరోజన, సైదమ్మ, భవాని, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 80








