+91 95819 05907

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి..

వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి..

ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి..

రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న డిమాండ్..

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు తెలిపారు. శనివారం మండల పరిధిలో రాయల వీరయ్య భవన్లో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తోటకూరి వెంకట నరసయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నున్న. నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అవలంబించకపోవడం ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే ప్రజలకు అందించి తమ వాగ్దానాలను నిర్వర్తించాలని హెచ్చరించారు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచి వారి ఖాతాలో తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే రైతులు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలుగా ఉండి కనీసం గూడు లేక అనేక అవస్థలు పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి నచ్చిన వారికి పొలాలు గృహాలు, ఉండి అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిరుపేదలనోళ్లల్లో మట్టి కొడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యక్ష సర్వేలు నిర్వహించి అర్హులైన పేదలకు మంజూరు చేస్తే బాగుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు కాకుండా నిజమైన అర్హులకు అందించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా రైతులకి రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాలలో జమ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి. గోపాలరావు, సిపిఎం మండల కార్యదర్శి రాచబంటి రాము, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాము, మద్దిని బసవయ్య కాటబత్తిని వీరబాబు మండల కమిటీ సభ్యులు దేశ బోయిన ఉపేందర్, యజ్ఞ నారాయణ, గడ్డం రమణ గడ్డం కోటేశ్వరరావు జల్లెపల్లి పుల్లయ్య ఆళ్ల మాధవరావు ఆలస్యం. రవి, నాన్నకు కృష్ణమూర్తి. తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో ◆కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో =కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్ సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని,

Read More »

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి.. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మీడియా మిత్రులు.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఖమ్మం ఏసిపిసాంబరాజు, కోమల దంపతుల కుమార్తె స్వప్న ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: పువ్వాడ ఉదయ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్ర కుమార్తె రమ్య వివాహం రఘునాథపాలెం మండలం

Read More »

 Don't Miss this News !