*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.*
*మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు*
*కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి న్యాయం చేయలేదు.*
నిందితులను కాపాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చెయ్యాలి.
తెలంగాణలో కాలి అవ్వబోతున్న రెండు రాజ్యసభ సీట్లలో రేవంత్ రెడ్డి మాదిగలకు ఒక సీటు ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాదిగలకు ఒక సీటు ఇవ్వాలి.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.
నేటి గద్దర్ హైదరాబాద్ న్యూస్ డెస్క్ ఫిబ్రవరి 21.
శనివారం నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో రేవంత్ రెడ్డి మౌనం విడనాడాలని ఇల్లీగల్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి రాజేష్ మృతి కి కారణమైన చిలుకూరి ఎస్సై సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా రాజేష్ కుటుంబానికి కొటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 రోజుల్లోనే తగు న్యాయం చేశారు.మరియమ్మ కుటుంబానికి 35 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చారు,ఎస్సైని సస్పెండ్ చేసి ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి కేసీఆర్ అనాడు న్యాయం చేశారని కానీ రాజేష్ విషయంలో లాకప్ డెత్ జరిగి 95 రోజులవుతున్న రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదని అన్నారు. ఎస్సీకమిషన్ లాకప్ డెత్ కు కారకులైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని, రీపోస్టుమార్టం నిర్వహించాలని డిజిపి మరియు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు అయిన ఇప్పటివరకు ఎస్ఐని సస్పెండ్ చేయలేదని,రీ పోస్టుమార్టం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాపాడుతున్నాడని అందుకోసం పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలిస్తూ సూర్యాపేట ఎస్పి మీద ఒత్తిడి చేశారని, ఎస్సీ కమిషన్ మెంబర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చనువుగా ఉండే ఎమ్మెల్యేలతో మాట్లాడించి ఎస్ఐ ని కాపాడటానికి అడిగినట్లు ఆధారాలతో నిరూపిస్తామన్నారు. మరియమ్మ కేసులో ఒక బీసీ బిడ్డ అయిన ఎస్ఐని సస్పెండ్ చేయించడం కోసం అనాడు స్పందించి రోడ్ ఎక్కిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు నిందితుడైన ఎస్సైని తన రెడ్డి సామాజిక వర్గం కాబట్టే కాపాడుతున్నాడు. బాధితుల పక్షాన ఉండకుండా నిందితుల పక్షాన ఉన్నాడు. ఎస్సీ కమిషన్ సస్పెండ్ చేయాలన్న నిందితున్ని కాపాడడం కూడా నేరమే అవుతుంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గం నుండి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్చి మొదటి వారంతో తెలంగాణ రాష్ట్రంలో కాలి అవబోతున్న రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో మూడు ఎస్సీ రిజర్వుడు లోకసభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా మాదిగలకు కేటాయించలేదుఅని. మాకు లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల సింగిల్ కాస్ట్ మాదిగల అయితే ఆ మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందిఅనిఅన్నారు.ప్రస్తుతం రాజ్యసభలోనైనా మాదిగలకు సీటు కేటాయించాలని లేకపోతే మాదిగల ఆవేదనకు గురికాకు తప్పదని అన్నారు.
ఇప్పటికే లోక్సభలో ఏడుగురు రెడ్లు ఉన్నా కూడా రేపు రాజ్యసభకు కూడా పోటీపడతారు ఖాళీ అయ్యే రెండిట్లో ఒకటి మాదిగలకు ఇచ్చి రెండోది ఎవరికి ఇచ్చుకున్న మాకు అభ్యంతరం లేదని అన్నారు.అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి మాదిగలకు చంద్రబాబు నాయుడు కేటాయించాలని అందులో వర్ల రామయ్య కి కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఎమ్ ఎస్ ఎఫ్ జాతియ అధ్యక్షులు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ, ప్రముఖ కవి వేముల ఎల్లయ్య గారు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు మంద రాజు మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మాదిగ, ముప్పూరి పురుషోత్తం మాదిగ, దావు ఆదిత్య మాదిగ ఈదుల రాజీవ్ ప్రదీప్ మాదిగ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.








