+91 95819 05907

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.

మోసం జరుగుతున్న తీరు ఇదీ..

ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒత్తిడితో శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలి.

పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించండి, ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి.

మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్ ♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో

Read More »

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి

* దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం

Read More »

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!! హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు

Read More »

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న

Read More »

గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్ కు ఎంపిక ★ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ కు పలువురి అభినందనలు

*పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక* *జనగాం జిల్లా* *23 ఫిబ్రవరి 2026* జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన

Read More »

ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

🌟 *ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చేయూత* 🌟 📅 తేదీ: 23 ఫిబ్రవరి

Read More »

 Don't Miss this News !