నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్
♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి
తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు తన అనుమతి లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి పలువురు తీసుకొచ్చారు. దీనితోపాటు కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కేటీఆర్‌కు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని… అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని… తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేయవచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.








