నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 22
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నీ వెంకటేశ్వర గుడి సమీపంలో గల ఉప్పరి వరలక్ష్మి 33 సం భర్త త్రిమూర్తులు కులము ఉప్పరి, వృత్తి ప్రైవేట్ జాబు, 2015 లో నెల్లూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులతో వివాహం జరిగినది. అప్పటినుండి త్రిమూర్తులు ఇల్లరికంగా వచ్చి చేగుంట లోనే ఉంటూ జీవిస్తున్నారు వీరికి ఒక కొడుకు నిన్న మధ్య రాత్రి మృతురాలు తన ఇంట్లో పడుకుని ఉండగా మృతురాలి భర్త త్రిమూర్తులు పారతో మృతురాలి తలపై కొట్టి చంపి ఆమె మెడలో గల పుస్తెలతాడు మరియు సెల్ ఫోను ఇంట్లో గల డబ్బులు తీసుకొని పారిపోయినాడు. ఈ విషయములో మృతురాలి అక్క అయినా ఉప్పరి సంతోషిని భర్త సాయిబాబా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.
Post Views: 85








