+91 95819 05907

మంత్రి తుమ్మలపై విమర్శలు సూర్యునిపై ఉమ్మేయడమే: అశ్వారావుపేట తుమ్మల యూత్ అధ్యక్షులు నార్లపాటి రాజశేఖర్ ధ్వజం

​అవినీతి మచ్చలేని 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తుమ్మలది.. అభివృద్ధికి నిలువుటద్దం మంత్రి పాలన.. అసత్య ప్రచారాలను నమ్మవద్దు.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 25: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార విమర్శలను అశ్వారావుపేట తుమ్మల యూత్ అధ్యక్షులు నార్లపాటి రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఖండించారు. మచ్చలేని నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రి తుమ్మల నిబద్ధతతో, అవినీతికి తావులేకుండా ప్రజలకు చేసిన సేవలే ఆయనకు శ్రీరామరక్ష అని, ఆయనను విమర్శించే స్థాయి జిల్లాలో ఏ రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు భూదాన్ భూములను చిల్లర పైసలకు అమ్ముకున్న చరిత్ర కలిగి ఉంటే, మంత్రి తుమ్మల మాత్రం మారుమూల అటవీ గ్రామాల వరకు బీటీ రోడ్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం సుప్రీంకోర్టు తీర్పు మరియు భూదాన్ బోర్డు ఫిర్యాదు మేరకే అధికారులు చర్యలు తీసుకున్నారని వివరిస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి తుమ్మలపై బురద చల్లడం సూర్యునిపై ఉమ్మేయడమే అవుతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల అభూత కల్పనలను, అర్థ సత్యాలను నమ్మడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కారని, ఆయనపై ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని నార్లపాటి రాజశేఖర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే

Read More »

ఇంటర్ మొదటి రోజు పరీక్ష ప్రశాంతం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన

Read More »

దశదిన కర్మలో నివాళులర్పించిన నాయకులు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన బానోత్ భీమ్లా నాయక్ సోదరుడు బానోత్ లక్ష్మణ్ ఇటీవల అకాల మరణం చెందారు.బుధవారం రఘునాథపాలెంలోని సమీపంలో ఉన్న గణేష్ గార్డెన్ ఫంక్షన్ హల్

Read More »

మంత్రి తుమ్మలపై విమర్శలు సూర్యునిపై ఉమ్మేయడమే: అశ్వారావుపేట తుమ్మల యూత్ అధ్యక్షులు నార్లపాటి రాజశేఖర్ ధ్వజం

​అవినీతి మచ్చలేని 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తుమ్మలది.. అభివృద్ధికి నిలువుటద్దం మంత్రి పాలన.. అసత్య ప్రచారాలను నమ్మవద్దు. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 25: రాష్ట్ర వ్యవసాయ

Read More »

ఫిబ్రవరి 27న దిశ సమావేశం నిర్వహణ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం: ఈ నెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా

Read More »

డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల నమోదు… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సిఎంఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు

Read More »

 Don't Miss this News !