+91 95819 05907

ఇంటర్ మొదటి రోజు పరీక్ష ప్రశాంతం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రం నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తూ, విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు.
పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, టాయిలెట్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ దైర్యం చెప్పారు. పరీక్ష సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, భాద్యతగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షకు జనరల్, ఒకేషనల్ కలిపి 18 వేల 258 మంది హాజరు కావాల్సి ఉండగా, పరీక్షకు 17 వేల 667 మంది హాజరు కాగా, 591 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రం తనిఖీ సమయంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే

Read More »

ఇంటర్ మొదటి రోజు పరీక్ష ప్రశాంతం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన

Read More »

దశదిన కర్మలో నివాళులర్పించిన నాయకులు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన బానోత్ భీమ్లా నాయక్ సోదరుడు బానోత్ లక్ష్మణ్ ఇటీవల అకాల మరణం చెందారు.బుధవారం రఘునాథపాలెంలోని సమీపంలో ఉన్న గణేష్ గార్డెన్ ఫంక్షన్ హల్

Read More »

మంత్రి తుమ్మలపై విమర్శలు సూర్యునిపై ఉమ్మేయడమే: అశ్వారావుపేట తుమ్మల యూత్ అధ్యక్షులు నార్లపాటి రాజశేఖర్ ధ్వజం

​అవినీతి మచ్చలేని 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తుమ్మలది.. అభివృద్ధికి నిలువుటద్దం మంత్రి పాలన.. అసత్య ప్రచారాలను నమ్మవద్దు. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 25: రాష్ట్ర వ్యవసాయ

Read More »

ఫిబ్రవరి 27న దిశ సమావేశం నిర్వహణ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం: ఈ నెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా

Read More »

డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల నమోదు… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సిఎంఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు

Read More »

 Don't Miss this News !