నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 26,
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం చేగుంట మండల పరిధిలోని పొలంపల్లి–మెదక్ రోడ్డులో చోటుచేసుకుంది. చేగుంట ఏఎస్ఐ బిక్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నుంచి చేగుంట మీదుగా చిన్న శంకరంపేటలోని రాధ స్టీల్ కంపెనీకి లోడ్‌తో వెళ్తున్న లారీ పొలంపల్లి శివారులోని పేపర్ మిల్లు సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ మితిలేష్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Post Views: 76








