+91 95819 05907

సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్‌కు 60 లక్షలకు పైగా ఇస్తారట…! తనకుతానుగా వచ్చిన మావోయిస్టుకు మాత్రం 25 లక్షలు ??

చేతులు ఎత్తి దండం పెట్టి.. ఎర్ర తివాచీలు పరచడం ఎంతవరకు

మన దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి దండం పెడుతూ మావోయిస్టులకు ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానం పలకడం తెలిసిందే. ఆ తరువాత వరుసగా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఆ వరవడినే అందిపుచ్చుకొని ప్రకటనలు చేయడం చూస్తున్నాం. వాటి ఫలితాలూ చూస్తున్నాం. ఇటీవలే, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మరో విడత మావోయిస్టులు లొంగిపోవాలని చేసిన ప్రకటన స్వాగతయోగ్యంగా ఉన్నది. ఈ ప్రకటన విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎందుకంటే, మార్చి 31కి ముందు ఈ ప్రకటన రావడం దాని ప్రత్యేకత. దాని ఫలితాలు ఇపుడు మన ముందున్నాయి.

నిన్న అత్యున్నత స్థాయిలో జరిగిన లొంగుబాట్లు ఈ దేశంలో సాయుధ మావోయిస్టుల ముగింపు దిశలో చివరాఖరుకు ముందడుగు అనుకోవచ్చేమో.. గత రెండేళ్లలో 500కు పైగా మావోయిస్టులు లొంగిపోయారనీ డీజీపీ ప్రకటించారు. మరో 11 మంది తెలుగు వాళ్లు మిగిలి వున్నారనీ, వారూ రావాలనీ కోరారు. వారి రాకకు మనమంతా ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానిద్దాం. మనం పరిచే ఎర్ర తివాచీలు వారు స్పష్టం చేస్తున్న రాజకీయాల కొనసాగింపునకు. కానీ మంత్రులు, పోలీసు అదికారులు పరిచే ఎర్ర తివాచీలు ఎంత వరకు అనేది అందరినీ వేదిస్తున్న సమస్య. ముఖ్యంగా లొంగిపోయిన వారిని వేదిస్తున్న సమస్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన మమత తన గోడు కలెక్టర్‌కు విన్నవించుకున్నది అందరం చూశాం. తనకు ఛత్తీస్‌గఢ్‌లో అధికారులు హామీ ఇచ్చిన ఏ సహాయం అందలేదనీ మొర పెట్టుకుంది. ఇది ఒక్క మమత సమస్యనా……కాదు, లొంగిపోయిన వారందరి సమస్య. వారు సమాజంలో గౌరవంగా బతకడానికి వారు ఎన్నుకున్న అధికారుల ఎర్ర తివాచీల దారి ఫలవంతం కావాలి. కానీ అది సాధ్యమా? మనం ఇటీవలి కాలంలో లొంగిపోయిన మావోయిస్టుల సమస్యలు ఒక్కసారి చూద్దాం.

2025 అక్టోబర్ 15 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు 60 మంది సహచరులతో కలిసి సాయుధంగా లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజ్జల వేణుగోపాల్ నాంది పలికారని చెప్పవచ్చు. ఆ తరువాత వరుసగా వందలాది కేడర్లు ఎక్కడికక్కడే లొంగిపోతున్నది చూస్తున్నాం. మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలలో లొంగిపోని రాష్ట్రమంటూ బహుశా లేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే, ఎక్కువ తక్కువ సాయుధంగా, అరెస్టుల పేరుతో వివిధ రకాలుగా లొంగిపోతున్న విషయం చూస్తున్నాం. లొంగిపోతున్నవారిపట్ల వివిధరాష్ట్రాలలో వివిధ విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.

ఉదాహరణకు లొంగిపోయిన వ్యక్తిని గతంలో జార్ఖండ్లో మూడు సంవత్సరాలు పోలీసులు సెక్యూరిటీపేరుతో వారి అదుపులోనే ఉంచుకునేవారు. ఇప్పుడు ఆ కాలాన్ని సంవత్సరన్నరకు తీసుకువచ్చారట! మహారాష్ట్రలో లొంగిపోయిన వారిని సంవత్సర కాలంవరకు గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్ల లోనే ఉంచుకుంటున్నారు. చత్తీస్ గఢ్‌లో లొంగిపోయిన వారిని దాదాపుగా ఆరుమాసాలకు తగ్గకుండా పోలీసుల అదుపులోనే ఉంచుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం లొంగిపోయిన వారిని కొద్దిరోజులలోనే వదిలివేస్తున్నారు. ఈరకంగా వివిధరాష్ట్రాలలో వివిధవిధానాలను అనుసరిస్తున్నారు. కాబట్టి, తెలంగాణలాగా మిగతారాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారి పట్ల ఉదారంగా వ్యవహరించి భద్రతపేరుతో నెలల తరబడి ఉంచుకోకుండా వారి బంధుమిత్రులకు అప్పగించాలి. లొంగిపోయిన నాయకత్వ కేడర్ల విషయంలో అన్నిరాష్ట్రాలలో ఒకేవిధానాన్ని అమలుపరచడం లేదు.

మావోయిస్టు సమస్య కేంద్రం దేశవ్యాప్త సమస్యగా తీసుకొని వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిపట్ల రాష్ట్రప్రభుత్వాలు కూడా అదేవిధానాన్ని అనుసరించడం మావోయిస్టు సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది. బయటికి ప్రజలమధ్యకు వస్తున్నామంటూ, పరిస్థితులు మారిపోయినాయంటూ, లొంగిపోతున్న మావోయిస్టులకు మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. అది చాలా అవసరం కూడా. మావోయిస్టు మల్లోజుల తాజా ప్రెస్ మీట్‌లో చేతులెత్తి జోడిస్తూ దేవ్ జీ తదితరులు బయటకు రావాలని చేసిన విన్నపం ప్రత్యక్ష ఫలితాలు చెప్పనవసరం లేదు.

ఇక లొంగిపోతున్న వారు బయటికి వచ్చిన తర్వాత వారిపై ప్రకటించిన రివార్డుల డబ్బు ఇచ్చే విషయం వింటే బయటివారు నోళ్లు వెళ్ళబెడతారు. ఇటీవల ఒక పొలిట్ బ్యూరో మెంబర్ లొంగిపోయిన నేపథ్యంలో 6 కోట్ల తలవిలువ కలిగిన వ్యక్తిగా చాలా ప్రచారం చేశారు. ఒక కేంద్రకమిటీ సభ్యుడు లొంగిపోతే కోటిరూపాయల విలువగా పోలీసులు ప్రచారం చేసుకుంటారు. వివిధస్థాయిలలో లొంగిపోతున్న వాళ్లగురించి పోలీసులు వారి తలల వెలలు గొప్పగా ప్రచారం చేస్తుంటారు. కానీ నిజానికి వారికి దొరుకుతున్నటువంటి రివార్డు రాశి చాలా స్వల్పంగా ఉంటుంది. ఆరుకోట్లు ప్రకటించిన కేంద్రకమిటీ సభ్యుడికి నిజానికి దొరికేది 25 లక్షలకు మించి ఉండదు. ఏరాష్ట్రం ముందు లొంగిపోతే ఆ రాష్ట్రం ప్రకటించిన మొత్తాన్నిమాత్రమే ఆయనకు ఇస్తుంటారు.

అందులో కోటిరూపాయలు ప్రకటించిన వారు ఎన్కౌంటర్లలో చనిపోతే వారిగురించి సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్‌కు 60 లక్షలకు పైగా ఇస్తారట…! తనకుతానుగా వచ్చిన మావోయిస్టుకు మాత్రం 25 లక్షలు దొరుకుతాయని వింటున్నాము. వాస్తవానికి వారిపై ప్రకటించిన తలవిలువ ఏ రాష్ట్రంలో ప్రకటించినప్పటికీ అన్నిరాష్ట్రాల వారికి జీఎస్టీల కోతలు, ఇన్కంటాక్స్ కోతలు ఏవి లేకుండా ఇవ్వడం ద్వారానే వారి శేషజీవితం ఎర్ర తివాచీల దారిలో కడుపు కాలకుండా బతకడానికైనా తోడ్పడుతుంది.

లొంగిపోయిన వారికి అందించే రివార్డుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంటోంది. ఇకవారికి అందిస్తాం అంటున్న ఇళ్లకు నెలలు గడిచిపోతున్నా ఇస్తున్న దిక్కే ఉండడం లేదు. ఇక భూముల విషయానికి వస్తే అవి కాగితాల మీదనైనా కొన్ని రాష్ట్రాలలో నోచుకోవడం లేదు. లొంగిపోయిన మావోయిస్టుకు ఒక ఇల్లుతోపాటు 5 ఎకరాల భూమి ఇస్తామని ఛత్తీస్గఢ్‌లో వుంది అంటారు. తెలంగాణలో కూడా భూమిని ఇస్తామంటారు. కానీ తెలంగాణలో ఒక కేంద్రకమిటీ సభ్యుడు 2018 లో లొంగిపోతే ఆయనకు భూమి ఇటీవలికాలంలో బండలు, రాళ్లు-రప్పలతో కూడుకున్న భూమి దొరికింది. ఒకఎస్.జడ్.సీ. మెంబర్ 2014లో లొంగిపోతే ఆయనకు నిన్నమొన్న అలాంటి భూమే దొరికింది. తెలంగాణలో సైతం చాలామందికి వ్యవసాయ భూమి కానీ, ఇల్లు గాని ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలలో భూమి ఇచ్చిన పాపాన పోవడంలేదు. ఇలా ఉంటే వారు బయటి జీవితంలో మారుతున్న పరిస్థితుల్లో నెట్టుకురావడం ఎలా సాధ్యమవుతుంది, ఎర్ర తివాచీలు ఎటు పోతాయో అధికారులే చెప్పాలి.

ఇక ఇల్లు, భూముల విషయం అలాఉంటే, వారికి బయటికి వచ్చిన తొలిరోజు నుండి కడుపులోకి బుక్కదిగడానికి కావలసిన నూకలకోసం తిప్పలు మొదలవుతుంది, రేషన్ కార్డు కోసం ఆరుమాసాలకు పైగా తిరగాల్సిన పరిస్థితి, ఆధార్ కార్డు లేకపోతే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఆ ఆధార్ కార్డు దొరకడానికి అనేక అవకతవకలతో అవస్థలు పడుతున్నారు. ఒక రాష్ట్రంలో ఆరుమాసాలకి ఇస్తే మరోరాష్ట్రంలో అదెప్పుడు ఇస్తారో తెలువదు. ఎవరిస్తారో తెలువదు. ఆధార్ కార్డు లేకుండా ఏపనిజరగని పరిస్థితి దేశంలో నెలకొన్న విషయం తెలిసిందే. వారికి పాన్ కార్డు అంటారు, మ్యారేజ్ సర్టిఫికెట్ అంటారు, బ్యాంక్అకౌంట్ తెరుస్తామంటారు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులైనా వెంటనే అందివ్వని ఉదాహరణలు కోకొల్లలు. ఈ ఆచరణకు స్వస్తి చెప్పి, కేంద్రప్రభుత్వం లొంగిపోయిన వారికి వెంటనే కనీసం ఒకనెల రోజులలోపు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇల్లు, భూమి ఇలాంటివి సమకూరుస్తే వాస్తవానికి కేంద్రప్రభుత్వం ఎర్రతివాచీ పరిచి మావోయిస్టులను స్వాగతిస్తున్న దానికి అర్థం ఉంటుంది.

ఇక లొంగిపోయిన వారిలో నాయకత్వం వయసు పైబడినవారు ఉండడం అనేక జబ్బులతో సతమతమవుతూ ఉండడంతో వారు కొన్నిఅదనపు సమస్యలను ఎదురుకుంటున్నారు. వారికి కేంద్రప్రభుత్వం ఉచితంగా మందులు అందించే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. వారు నెలనెలా వేలరూపాయలు మందులకోసం ఖర్చుచేయడం తలకు మించిన భారంగా ఉంటుంది. కానీ అవితప్పని ఖర్చులు. లొంగిపోయిన మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో కిడ్నీలు దెబ్బ తిని బాధపడుతున్న వార్త మీడియాలో వైరలయింది. అందుకోసం కేంద్రప్రభుత్వం వారికి శేష జీవితాంతం ఉచితంగా మందులు లభించే అవకాశాన్ని కల్పించాలి.

మరో ముఖ్యమైన విషయం ఇటీవల చత్తీస్ గఢ్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఆ ప్రభుత్వం జైళ్లల్లో ఉన్నవారి కేసుల విషయంలో అనుసరించే వైఖరిని ప్రకటించింది. అది వినడానికి బాగానే ఉన్నది. ఉద్యమంలో అంతా కలిసి పనిచేసినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదకర పరిస్థితులలో కొందరు అరెస్టులు కావడం, జైలుపాలుకావడం, అనేకరకాల కేసులు ఎదుర్కోవడం, మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి వారిని కేంద్రప్రభుత్వం పరిశీలించి వారికి కూడా లొంగిపోయినవారి విధానాలనే వర్తింపచేస్తే ఆ సమస్య పరిష్కారం దిశలో మరో సానుకూల ముందు అడుగు అవుతుంది. ప్రజలకు ఒక మంచిసందేశం ఇచ్చినవారు అవుతారు. ఇలా వారి సమస్యలు ఇంకా చాలానే వుండి వుంటాయి. వాటిని కేంద్రం చేపట్టి పరిష్కరించడం ద్వారా తిరిగి వారు మరో ‘దారి తప్పిన’ వారి ఆలోచనలకు దగ్గరవకుండా వుంటారని ఆశించవచ్చు!

చిత్ర
63024 18202

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్‌కు 60 లక్షలకు పైగా ఇస్తారట…! తనకుతానుగా వచ్చిన మావోయిస్టుకు మాత్రం 25 లక్షలు ??

చేతులు ఎత్తి దండం పెట్టి.. ఎర్ర తివాచీలు పరచడం ఎంతవరకు మన దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి

Read More »

టీపీయుఎస్ కృషితో మెదక్ జిల్లాలో పదవ తరగతి మాసాయిపేట మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు

*హర్ష వ్యక్తం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి తెలిపారు* నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం అధ్యక్షునిగా అలుపెరుగని

Read More »

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేతను తీవ్రంగా ఖండించిన సీపీఎం

నేటి గదర్ న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను

Read More »

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే

Read More »

ఇంటర్ మొదటి రోజు పరీక్ష ప్రశాంతం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన

Read More »

దశదిన కర్మలో నివాళులర్పించిన నాయకులు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన బానోత్ భీమ్లా నాయక్ సోదరుడు బానోత్ లక్ష్మణ్ ఇటీవల అకాల మరణం చెందారు.బుధవారం రఘునాథపాలెంలోని సమీపంలో ఉన్న గణేష్ గార్డెన్ ఫంక్షన్ హల్

Read More »

 Don't Miss this News !