+91 95819 05907

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు కొనియాడారు. శనివారం బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన జవాన్ కేశవరెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యాన్ని నింపారు. దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, కోటి రెడ్డి, రాము, మారం చంద్రశేఖర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

Read More »

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్

Read More »

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా

Read More »

ఆర్ అండ్ బి అధికారులు.. *ప్రజల ప్రాణాలను కాపాడండి..!

* నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా

Read More »

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్ కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

Read More »

 Don't Miss this News !