+91 95819 05907

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం మరియు మత్స్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. పర్యటనలో భాగంగా పాతగంగారం, చౌటిగూడెం, తిమ్మంపేట, రామాంజనేయపురం మరియు మాదారం గ్రామాల్లో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. విద్యాభివృద్ధిలో భాగంగా పాతగంగారం ప్రైమరీ స్కూల్ కొత్త భవనానికి, టీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలు, పొగళ్లపల్లి మరియు సత్యంపేట హైస్కూళ్ల ప్రహరీ గోడల నిర్మాణానికి పునాదిరాళ్లు వేశారు. జగన్నాధపురం, పొగళ్లపల్లి మరియు ములకలపల్లి రైతు వేదికల వద్ద లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, మూకమామిడి గ్రామసభలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం యూనిట్‌ను, మండల కేంద్రంలో పౌల్ట్రీ షెడ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, మండల అధికారులు, బత్తుల అంజి, కారం సుధీర్, స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

Read More »

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్

Read More »

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా

Read More »

ఆర్ అండ్ బి అధికారులు.. *ప్రజల ప్రాణాలను కాపాడండి..!

* నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా

Read More »

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్ కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

Read More »

 Don't Miss this News !