+91 95819 05907

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే

అలాగే కేసులు ఎత్తివేయండి
భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి
____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మార్చి 11 : ఆలస్యంగా నైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను గుర్తించి , వెలుగుమట్ల లోని భూదాన భూముల లబ్ధిదారులకు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వడం  మంచి నిర్ణయం , అలాగే భూదాన భూముల అంశంలో అరెస్టు కాబడ్డ వారందరి పై  కేసులు ఎత్తివేసి , భూదాన భూముల మొత్తం వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలని , మిగతా లబ్ధిదారులకు సైతం ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని లంబాడి హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పి ఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్  బుధవారం ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. పి భూదాన భూముల
లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని , మిగతా లబ్ధిదారులకు కూడా  ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇ చ్చి న్యాయం చేయాలని కోరారు. వారంతా పేదలు , నిజమైన లబ్ధిదారులు గా భావించారు కాబట్టే అధికారులు  ఆ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని  నిర్ణయించుకున్న విషయం  స్పష్టంగా అర్థం చేసుకుంటే మరి కేసులు ఎందుకు ,ఆందోళనలు ఎందుకు ? కూల్చివేతలు ఎందుకు ? జరిగాయో వివరించాలని తెలిపారు. ఇతర  చోట్ల నుండి వచ్చిన లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాలలోనే ఇళ్లస్థలాలు కేటాయిస్తా మనడం సమంజసంగా లేదన్నారు. వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన బోర్డు చైర్మన్ చెప్తున్న  దానికి విరుద్ధంగా అధికారులు భూదాన భూముల లెక్కలను తగ్గించి చెప్పటం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. 62 చిల్లర ఎకరాల స్థలాన్ని 31 ఎకరం వరకు  కుదించి , ఇదే భూదాన భూమి మొత్తం అనడం భావ్యం కాదన్నారు. అసలు వెలుగుమట్ల లో  అది కారులు పేర్కొంటున్న సర్వే నెంబర్లను అనుసరించి మొత్తం భూదాన భూమి ఎంత ఉందని , ప్రవేట్ భూమి ఎంత ఉంది ? ప్రభుత్వ భూమి ఎంత ఉంది ? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా భూదాన భూమి ఎంత ఉంది ? ఎవరెవరి చేతులలో ఎంత భూమి ఉందో ?
ఎవరెవరు ఆక్రమించుకున్నారు ? ప్రభుత్వమే తన అవసరాలకు ఎంత ఉంచుకున్నది ? అనే అంశాలపై సమగ్ర వివరాల ను అందించేందుకు గాను శ్వేతా  పత్రం  ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెల్లారుజానే అమానుషంగా ఇళ్లు కూల్చి వేత ఘటనలో మద్దతు ప్రకటించిన వారి పై , ప్రశ్నించిన వారి పై , పాత్రికేయుల పై కేసులు నమోదు చేయడం అన్యాయం , వెంటనే కేసులు చేయడంతో పాటు ఈ ఉదంతంలో అతి ఉత్సాహం చూపించిన పోలీసులపై
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

 Don't Miss this News !