*ఎక్సైజ్ శాఖ ఎక్కడ?*
*మద్యం సిండికేట్ దందా విచ్చలవిడి…*
*పేదోడి కడుపు కొడుతున్న మద్యం సిండికేట్….*
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
బూర్గంపాడు మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి.. మద్యం క్రయ విక్రయాలు చేస్తున్నారు.దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టుషాపులలో మద్యం ఏరులై పారుతోంది.బెల్ట్ షాప్ లో మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో, బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా అధిక ధరలకు అముతూ మమ్మల్ని ఆపేది ఎవరు అంటూ ఎక్సైజ్ శాఖ వారికి సవావిసురుతున్నారు. కూలీ చేసి జీవనం సాగిస్తున్న పేదోడు కష్టాన్ని మద్యం సిండికేట్ నిర్వహకులు దోసుకుంటున్నారు. బూర్గంపాడు,సారపాక, లక్ష్మీపురం గ్రామంలో హద్దు అదుపు లేకుండా బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే, ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బూర్గంపాడు, సారపాక గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపులలు సమయపాలన లేకుండా, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మటం వల్ల గొడవలకు కారణం అవుతున్నాయి..గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా, నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు.బూర్గుంపహాడ్,సారపాక లో ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి, ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రేటు కంటే రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణా షాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జన ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి, గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా, సంబంధిత ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపులు నిషేధించే శాఖ పని చేయనప్పుడు ఆ శాఖకు జీతాలు ఎందుకని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే పన్ను రూపంలో నగదును ప్రభుత్వం..ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తా ఉంటే ఎక్సైజ్ శాఖ ఎందుకు పనిచేయటం లేదని పలు ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం,గొడవలు వంటి సంఘటనలు జరుగుతున్న గాని ఏమాత్రం బాధ్యత లేకుండా సంబంధించిన శాఖ వ్యవహరించటం హాస్య పదమని పలువురు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే దారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం ఏమిటని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.