★ ఋణాలు కట్టాలని రైతులను ఒత్తిడి చేస్తున్న బ్యాంకు సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాలి
★ఆటో ద్వారా మైకులు పెట్టి రుణాలు తీసుకున్న రైతుల పేర్లను గ్రామాల్లో బహిర్గతం చేస్తున్న బ్యాంకు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
★ఒకపక్క ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని అంటుంటే బ్యాంకు సంస్థలు రైతులని రుణాలు కట్టకపోతే ఇల్లు, పొలాలు జప్తు చేస్తామనడం కేసులు పెడతామని అనడం సరైనది కాదు
★బ్యాంకు సంస్థలకు రైతులను ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వం నోటీసులు జారీ చేసి రైతులకు భరోసా కల్పించాలి
★రైతుల పట్ల బ్యాంకు సంస్థల అత్యుత్సాహం మానుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తాం…
CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండ చరణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం/చర్ల:
చర్ల మండలంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రందా పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండాచరన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన శుక్రవారం మంత్రి మండల సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో రైతు భరోసా రైతు రుణమాఫీ పై చర్చ చేయడం జరిగిందని అందులో భాగంగానే ప్రభుత్వం 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ 9 వరకు ఐదు సంవత్సరాల కు సంబంధించిన రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేస్తామని తెలియజేశారు దీనికి సంబంధించిన పూర్తి పనిని ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు ఆగస్టు 15 కల్లా దీని నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అన్నారు రైతులకు భరోసా కల్పించాలని రైతులకు మానసిక ధైర్యాన్ని కల్పించాలని రైతులను కష్టాల నుండి తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదని అన్నారు కానీ రైతులకు మంచి చేయాలని ప్రభుత్వం యొక్క ఆకాంక్షను బ్యాంకు సంస్థలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు ఒకపక్క ప్రభుత్వం రైతుల రుణమా రుణాలు మాఫీ చేస్తామనిR అంటుంటే మరోపక్క రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకు సంస్థలు రైతులు తీసుకున్న రుణాలు కట్టకపోతే వారి పొలాలు జప్తు చేస్తామని వారి ఇళ్ళని జప్తు చేస్తామని వారి ఆస్తులని లాక్కుంటామని బెదిరింపులకు గురిచేస్తున్నారు నోటీసులు పంపిస్తున్నారు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆటోలో మైకు ప్రచారం చేస్తూ గ్రామాల్లో రుణాలు తీసుకున్న రైతుల పేర్లు చెబుతూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు మానసికంగా హింసకు గురి చేస్తున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే రైతు తీవ్రంగా సతమతం అవుతున్నాడు ఎన్ని కష్టాలు ఉన్న వ్యవసాయం చేయక తప్పని రైతు పంట పండించే అందుకోసం వడ్డీలకి అప్పులు తెచ్చి కష్టాలు పాలవుతున్నాడు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నాడు అట్లాంటి సందర్భంలో నూతన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఎంతో ఆశతో ఉన్న రైతులను బ్యాంకులవారు హింస గురి చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వం చెప్పిన విధంగా రుణమాఫీ జరిగేదాకా బ్యాంకు సంస్థలను రైతులను వేధించోద్దని నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు రహస్యంగా ఉంచాల్సిన రుణాలు తీసుకున్న రైతుల పేర్లని మైకుల ద్వారా బహిర్గతం చేసి ప్రచారం చేస్తున్న బ్యాంకు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కచ్చితంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పొంద పార్టీ రైతుల తరఫున ఉంటుందని భవిష్యత్తులో వారి సమస్యల కోసం ఉద్యమిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు నాయకులు పాలెం చుక్కయ్య, కొండ కౌశిక్ పార్టీ మండల నాయకులు చెన్న0 మోహన్ మహిమదా తదితరులు పాల్గొన్నారు.