రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 15:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన ఇరవై ఎస్సీ బీసీ కుటుంబాలకు చెందిన ప్రజలము వార్డులో కలసి జీవిస్తున్నాము.సుమారుగా 1800 మంది జనాభా 1300 మంది ఓటర్లు కలిగిన మా వార్డులో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన నాటినుండి ఈరోజు వరకు రేషన్ దుకాణం వార్డులో ఏర్పాటు చెయ్యలేదని భైరం కుమార్ అన్నారు.గతంలో కూడా వినతులు సమర్పించిన మా సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు.ప్రస్తుతం మేము మా కాలనీ నుండి రేషన్ తీసుకోవడానికి సుమారుగా రెండు కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.మా వార్డుకు సంబందించిన రేషన్ కార్డులు ఎక్కువ ఏ రేషన్ దుకాణంలో ఉన్నవో అదే ప్రతిపాదనతో మా వార్డు ప్రజల యందు దయచూపి మా వార్డులో రేషన్ దుకాణం ఏర్పాటు చెయ్యాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తూ తహసీల్దార్ ను కోరారు.ఈ కార్యక్రమంలో బైరం కుమార్, మేఘమా గారి శంకరయ్య, బైరం శంకర్,గావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.