+91 95819 05907

ప్రజావాణిలో సమస్యల కుప్పలు ….పరిష్కారం ఎప్పుడు అడుగుతున్న ప్రజలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ ప్రవహిస్తున్నది.అనేక సమస్యలతో పట్టణ ప్రజలు ఇతర కార్యాలయాలకు పోక పోయినాక సమస్య పరిష్కారం కాక ప్రజావాణికి క్యూ కడుతున్నారు.మున్సిపాలిటీ ఆధీనంలోని ఐదో వార్డులో పెట్రోల్ బంక్ వెనుక ఉన్న కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా బీసీ కాలనీ మధ్యలో చిన్న చెరువుగా మారి ఆ ప్రాంతమంతా బురద మయంగా మారడంతో కాలనీ వాసులకు వాహనాలకు గాని నడిచి వచ్చేవారికి కానీ, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు వాపోతున్నారు.ఈ విషయమై మున్సిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్ శోభ కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్య లక్షల్లో తీరేది కాదని కోట్లల్లో అయితేనే పరిష్కారం అవుతుందని బీసీ కాలనీ నుంచి వచ్చే నీరు ఇక్కడ పడడంపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇప్పట్లో మాత్రం తక్షణంగా ఈ సమస్య పరిష్కారం కాదని తేల్చి చెప్పారు.మళ్లీ బడ్జెట్ వచ్చినప్పుడు కోట్లలో పనిచేయడం జరుగుతుందని అప్పటివరకు ఏమి చేయలేమని ఆయన తెలిపారు.కాలనీవాసులు మాత్రం ఎంత కాలం వేచి ఉండాలి కష్టకాలంలో ఆదుకోకపోతే ఏమి లాభమని పెద విరుస్తున్నారు.కాలేజి వెళ్లే విద్యార్థులకు అక్కడ బ్రిలియంట్ పాఠశాలను మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆశ్రయంగా అప్పగించడం జరిగింది.బాలికలు కాలేజీకి వెళ్లడానికి రావడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. వెంటనే ఏమైనా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగడానికి వెనుకాడమని కాలనీవాసులు హెచ్చరించారు. అలాగే రామాయంపేట తహసిల్దార్ రజని కుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని ఆమె అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 80 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిష్కరించడానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దరఖాస్తుల్లో బుడగ జంగాల కులానికి చెందిన ఎల్లవ్వ గత 40 సంవత్సరాలుగా రామాయంపేట పట్టణంలో నివసిస్తున్న తాము పింఛన్ కూడా రాలేదని కనీసం నివసించడానికి ఇల్లు లేదని ఆమె వాపోయారు.తమ భర్తకు కూడా పింఛన్ రావడం లేదని ఎలా బతకాలని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వవలసిందని తాము అర్హులమని వెంటనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఆమె దీనంగా అధికారులను అర్థించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !