★డబుల్ పింఛన్ల ఇష్యూ మరవక ముందే మరో మాయాజాలం బట్టబయలు
★ఒకరి తో సహజీవనం చేస్తూనే వితంతు పింఛన్లు పొందుతున్నారా?
★ఒంటరి మహిళ పింఛన్ కొరకు భర్తలకు దూరంగా?
★మంత్రి సీతక్క విచారణ చేపడితే నిజ నిజాలు బట్టబయలు
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి:
రెండు పెన్షన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానా కు పలువురు పింఛన్ దారులు గండి కొట్టారు. ఉద్యోగ విరమణ లేదా భర్త /భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ లేదా మృతి చెందిన ప్రభుత్వం ప్రతి నెల వేల రూపాయల పింఛన్ తీసుకుంటారు. వారు అనర్హులు ఐనప్పటికిని ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే ఆసరా పింఛన్లు సైతం ప్రతి నెల తీసుకున్నారు.దీనితో ప్రభుత్వం పై అధిక భారం పడింది. ఆసరా పింఛన్లలో జరుగుతున్న అవినీతి పై ప్రభుత్వం దృష్టి సారించి విచారణ చేపట్టింది. సెర్ప్ తో విచారణ చేపట్టగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది పై గా ఇలా పింఛన్ పొందారని బట్టబయలైంది. వారిలో కొంతమంది మృతిచెందగా… ఇంకా 1800 మందికి పైగా ప్రతినెల ఆసరా పెన్షన్ వారి ఖాతాలలో జమవుతున్నట్లు విచారణలో తేలింది. అక్రమ పద్ధతిలో ఆసరా పింఛన్ పొందిన వీరి నుండి రికవరికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కాస్త సమయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది మరవక ముందే ఇదే ఆసరా పెన్షన్ లో మరో బాగోతంపై గుసగుసలు వినపడుతున్నాయి.
★ఒంటరి మహిళల పింఛన్ కోసం భర్తకు దూరంగా భార్యలు★
అవును ఇది కఠోర నిజం. మానవత్వం మరిచి కొంతమంది స్త్రీలు తమ భర్తలు బతికుండగానే… కేవలం ప్రభుత్వ అందించే ఆసరా పింఛన్ల కొరకు భర్త ల దూరంగా ఉంటున్నారు. మరికొందరు మహిళలు మరో పురుషుడితో సహజీవనం చేస్తూనే… చనిపోయిన మాజీ భర్త పేరు డెత్ సర్టిఫికెట్ తీసుకోని పింఛన్లు పొందుతున్నారు. మానవ బంధాల కంటే డబ్బుకు ఎంత ప్రాధాన్యత పెరిగిందో ఆసరా పింఛన్ల లో భర్తలు బతికుండగానే పింఛన్ పొందిన మహిళలను చూస్తే అర్థమవుతుంది. మంత్రి సీతక్క మరోమారు విచారణ చేయబడితే నిజా నిజాలు బయటకు వస్తాయి. బంధాలను మరిచి డబ్బు కు కక్కుర్తి పడుతున్న ఇలాంటి వారిపై విచారణ చేపట్టి రికవరీ చేయాలని పలువురు కోరుతున్నారు.