నేటి గదర్ న్యూస్, మణుగూరు టౌన్: మండలం కూనవరం గ్రామ పంచాయతీ లో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమం ను ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు ప్రారంభం చేసినారు.
ఈ సందర్బంగా ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ ( సీతక్క ) నిర్ణయం మేరకు అమ్మ మాట -అంగన్వాడీ బాట కార్యక్రమం ను విజయవంతం చేయుటకు మొదటి గా అంగన్వాడీ స్కూల్ ను సందర్శించడం జరిగిందని ఆ తర్వాత గ్రామం లో చిన్న పిల్లలు ను అంగన్వాడీ స్కూల్స్ లో చేర్పించండి అని ర్యాలీ నిర్వహించడం జరిగిందని, కనుక తల్లి తండ్రులు చిన్న పిల్లలు ను అంగన్వాడీ స్కూల్స్ లో చేర్పించి మీ పిల్లలు భవిష్యత్ కు పునాదులు వేయండి అని గుడిపూడి. కోటేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమం లో ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు తో పాటు పంచాయతీ సెక్రటరీ సంధ్యా రాణి, కూనవరం గ్రామ పంచాయతీ లో ఉన్న కూనవరం 2 అంగన్వాడీ టీచర్ వీర కుమారి, వై యస్ ఆర్ నగర్ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వంక. నాగమణి, యన్ టి ఆర్ నగర్ అంగన్వాడీ టీచర్ వి. లీలావతి, చంద్రబాబు నగర్ అంగన్వాడీ టీచర్ వై. జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









