భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీలోని కూనవరం పై గుంపు నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిస్టాత్మకంగా ప్రారంభం చేసిన వన మహోత్సవం కార్యక్రమం ను ఈ రోజు కూనవరం గ్రామ పంచాయతీ లో ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో ఎం ల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారు గత వారం లో మొక్కలు నాటి పచ్చని చెట్లు ప్రగతి కి మెట్లు అని పిలుపు ఇచ్చారని దాంట్లో భాగంగా ఈరోజు కూనవరం లో ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నామని అందరు శ్రద్ధ తో ఈ మొక్కలు ను పెంచి పెద్ద చేయాలని ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమం లో ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు తో పాటు పంచాయతీ సెక్రటరీ సంధ్యారాణి, పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.









