★మోహర్రం సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
★ప్రశాంతంగా ఉత్సవాలు ముగిసేలా చూడాలి
★ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దు
★ఆయుధాల ప్రదర్శన, రెచ్చగొట్టే సంజ్ఞలు మరియు కార్యకలాపాలు నిషేదం
★విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
సిల్వర్ రాజేష్ ,నేటి గదర్ ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… మొహర్రం సందర్భంగా జిల్లా పోలీసులు ఇప్పటికే మొహర్రం నిర్వాహకులు, కమిటీలతో శాంతి, మతసామరస్యం కోసం సమావేశాలను నిర్వహించామని మొహర్రం నిర్వాహకులు, కమిటీలు కచ్చితంగా పోలీస్ వారి సూచనలను ఆదేశాలను పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు. మొహర్రం ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ గారు సూచించారు. వేడుకలు ప్రశాంత వాతారణంలో ముగిసేందుకు సిబ్బంది కృషి చేయాలని ఇందుకు మొహర్రం నిర్వాహకులు, కమిటీ సబ్యులు కూడా సహకరించాలని అన్నారు. సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఎవరికీ కేటాయించిన స్థానాలలో వారే విధులను నిర్వర్తించాలని, ఉన్నతాధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. బందోబస్తు సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సెక్టార్ వైజ్‌గా తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలన్నారు. పీర్ల ఊరేగింపు సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి ఒక్కరిపై దృష్టి సారించాలన్నారు. అలాగే ముందుగా నిర్ణయించిన సమయ షెడ్యూల్‌ను ప్రకారం మొహర్రం ఉత్సవాలను నిర్వహించాలని మరియు ఊరేగింపు ముందుగా నిర్ణయించిన రోడ్ మ్యాప్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ఆయుధాల ప్రదర్శన, రెచ్చగొట్టే సంజ్ఞలు మరియు కార్యకలాపాలు ఖచ్చితంగా నిషేధిమని ఎవరైనా ఆయుధాల ప్రదర్శన, రెచ్చగొట్టే సంజ్ఞలు చేసి శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని అలా కాదని ఎవరైనా తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని జిల్లా పోలీసులు నిరంతరం గమనిస్తారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరైనా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని పోలీస్ వారి ఐ.టి సెల్ నెం. 8712657960 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. అన్నింటికంటే మించి ఊరేగింపును బయటకు తీసుకురావడానికి పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.