కోడెబోయిన
నేటి గదర్, జూలై 16,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
సీజనల్ వ్యాధులతో పాటు, విష జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతుంటే అధికారులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లుతలేరని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోడె బోయిన రవి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మండల పరిధిలోని గ్రామాల్లో సీజనల్ వ్యాధులతో విష జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. అయినప్పటికీ అధికారులు కనీస చర్యలకు సైతం కృషి చేయట్లేదని విమర్శించారు. గ్రామాలలో పారిశుధ్యం పనులు సైతం ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విపరీతమైన దోమలు పెడుతూ ప్రజలు విష జ్వరాలు భారీన పడుతుంటే అధికారులు కంటికి కనబడతలేరని ఎద్దేవా చేశారు. గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.









