+91 95819 05907

రంపచోడవరం, చింతూరు, పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఎ)లు పాలకవర్గ సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేయాలి

గిరిజన నిరుద్యోగుల పైన తెలుగుదేశం. బిజెపి. జనసేన పార్టీల కూటమి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే!

డీ.ఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే జీ .ఓ నెంబర్ 3 స్థానంలో గిరిజన నిరుద్యోగుల కోసం కొత్త చట్టం అమలు చేయాలి?
పాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత డిమాండ్

అరకు వాలీ నేటి గదర్ మండల న్యూస్:

అరకు వాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత శ్రీ చిన్న స్వామి మాట్లాడుతూ*గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేశారు గిరిజన సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఐటిడిఏ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది ?ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీగా భావించాలి అలాంటిది గత రాష్ట్ర ప్రభుత్వము జగన్‌ పాలనలో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం, పార్వతిపురం. సీతంపేట. చింతూరు, పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఎ)లు నిర్వీర్యమయ్యాయి. గత మూడేళ్లుగా ఒక్కసారి కూడా పాలకమండలిని సమావేశపర్చకుండా మూడు ఐటీడీఏలకు చట్టబద్ధత లేకుండా చేశారు పాలకమండలి ఆమోదాలు లేకుండానే ఈ మూడు ఐటీడీఏల్లో ఆర్థిక లావాదేవీలు సాగిపోయాయి. ప్రభుత్వ శాఖగా కాకుండా స్వయం ప్రతిపత్తి సొసైటీలుగా ఏర్పాటైన ఐటీడీఏలు సొసైటీల చట్టం కింద రూపొందించుకున్న నియమావళి మేరకే నడవాల్సి ఉంది. జిల్లా కలెక్టరు అధ్యక్షుడిగానూ, పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల మండల ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకమండలి సమావేశమై ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను నిర్దేశించుకోవాలి కానీఏడాదికి ఒక వార్షిక సమావేశాన్ని కూడా నిర్వహించని దుస్థితిలో రంపచోడవరం, చింతూరు, పార్వతీపురం సీతంపేట పాడేరు ఐటీడీఏలు ఉన్నాయి. ఒక్కసారి కూడా పాలకమండలి ఆమోదం తీసుకోకుండానే అధికారులు ఇష్టారాజ్యంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు ఈ ప్రకారం ఐటీడీఏలు నిర్వీర్యమై చట్టబద్ధతను కోల్పోయాయి. నిబంధనల ప్రకారం ఐటీడీఏల ద్వారా అమలయ్యే ఏ కార్యకలాపమైనా పాలకమండలి ఆమోదంతోనే జరగాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల రాబడి, వ్యయాలు తదితర అంశాలన్నింటిని పాలకమండలి ఆమోదించాల్సిందే! కానీ గత మూడేళ్లుగా ఈ ఐటీడీఏలలో పాలకమండలి ఆమోదం లేకుండానే కోట్లాది రూపాయలతో కార్యకలాపాలు సాగాయి గిరిజనుల పైన చిత్తశుద్ధి ఉంటే కూటమి తెలుగుదేశం బిజెపి జనసేనరాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేయాలి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తక్షణమే మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వము భర్తీ చేస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందు జి ఓ నెంబర్ 3 స్థానంలో గిరిజన నిరుద్యోగుల కోసం చట్టబద్ధత కొత్త చట్టం తీసుకురావాలని అదే విధంగా ఐటిడిఏ లలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగ పోస్టులు తక్షణమే నోటిఫికేషను విడుదల చేసి ఉద్యోగాలుభర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలగంజి సోమేశ్వరరావు తేడా బారికి భీమారావు మోష్య ప్రేమ్ కుమార్ మజ్జి అద్దు జంపరంగి వెంకటబాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !