★ తక్షణమే గురుకుల సమస్యలు పరిష్కారించాలి
★PDSU ఖమ్మం జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్
నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా లో ఉన్న బీసీ.ఎస్సి .ఎస్టీ మైనారిటీ గురుకుల అనేక సమస్యలకు నిలయంగా ఉన్నాయాని కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వైరా నియోజకవర్గం లోని రెబ్బవారం గ్రామం లోని బసి గర్ల్స్ గురుకుల కి సొంత భవనం ఏర్పాటు చేయడం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెబ్బ వారం గురుకుల నందు ధర్నా చేయడం జరిగిందని పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ లు కాంగ్రెస్ ప్రభుత్వం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ లు. మాట్లాడుతూ
ఖమ్మం జిల్లా అధికారుల
పిల్లలను ఇలాగే వదిలేస్తారా?
గురుకుల వంట చేసేది పురుషుడు కావడం, అక్కడి నుంచి స్నానపు గదులు కనిపిస్తుండడంపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించిన తీరు పై వారు మండిపడ్డారు. భవనం లో ఏడు గదులను బోధనేతర అవసరాలకు వాడు తుండడంపై ప్రిన్సిపాల్ రాధికను మందలించారు. అంతేకాక ప్రిన్సిపాల్, ఆమె భర్త భవనంలోని పైఅంతస్తులో నివాసముంటున్నట్లు గుర్తించి ఆడపి ల్లలు ఉండే పాఠశాల, వసతిగృహంలో ఎలా ఉం టున్నారని ప్రశ్నించారు.
ఖమ్మం లోని గురుకులు మరియు వైరా రెబ్బవారం మహిళా గురుకుల నందు విద్యార్థులను ఒకే క్యాంపస్లో క్లాస్ నిర్వహిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి అందించాల్సిన ఉదయమా అల్పాహారం అనేక గంటల లేట్ గా మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు పెట్టాల్సిన భోజనం సాయంత్రం నాలుగు గంటలకు కు పెట్టే పరిస్థితి కనిపిస్తోందని ఇదేంటి అని ప్రశ్నించిన విద్యార్థి తల్లిదండ్రులపై బి సి డి డి ఆర్ సి ఓ మేడం గారు మరియు బీసీ గురుకుల ప్రిన్సిపాల్ గారు అధికారులకు గారికి చెప్పకుండి అంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నేడు గురుకుల విద్యా వ్యవస్థ లో కనిపిస్తోందాని తక్షణమే జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
300 మంది ఉండాల్సిన బిల్లింగ్ లో సుమారు 800 మంది కి పైగా విద్యార్థులను 20 మంది పట్టాల్సిన రూములో యాభై మంది విద్యార్థులను అగ్గిపెట్టెలో పుల్లగా ఉంచే దౌర్భాగ్య పరిస్థితి నేడు బీసీ.ఎస్సి. ఎస్టీ. మైనారిటీ గురుకుల లో కనిపిస్తోందని వారు ప్రభుత్వం పై మండి పడ్డారు.
రెబ్బవారం గురుకులని వేరే క్యాంపస్ మార్చాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్ర మినిస్టర్స్ స్పందించి జిల్లా లో ఉన్న గురుకులంలో నెలకొన్న సమస్య లు పరిష్కారం చేయాలని లేకుంటే పి. డి. ఎస్. యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేపడుతాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అనూష, కావ్య, అలేఖ్య, స్పందన, శైలజ తదితరులు పాల్గొన్నారు.









