★ప్రభుత్వాలు మారిన నేటికీ మా బ్రతుకులు మారలేదు
★విఓఏల సమస్యలు పరిష్కారించాలి ఏఐటీయూసి జిల్లా ప్రదాన కార్యదర్శి నరటి ప్రసాద్
నేటి గద్దర్ కరకగూడెం:సేర్పులో పని చేస్తున్న గ్రామ సంఘ సహాయకులు విఓఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి నరటి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అయన కరకగూడెం మండల విఓఏల యూనియన్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారి తో సమావేశాలు ఏర్పాటుకు పాటుపడి మహిళలను ఆర్ధికంగా బలోపేతం చెయ్యడంలో ఎవిఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని కాని వారి బ్రతుకులు మాత్రం మారడం లేదనీ అన్నారు.విఓఏలతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ పనులు కూడా ఇవ్వడం జరిగినదని వాటి ద్వారా కనీసం వారు రీఛార్జ్ కూడ చెయ్యడం లేదనీ అన్నారు. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కె ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇప్పటికైన కేద్ర రాష్ట్ర ప్రభుత్వలు విఓఏల సమస్యలు పరిష్కారించి,కనీస వేతన చట్టని అమలు చెయ్యాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు,వేల్పుల.మల్లికార్జున్,లక్ష్మీ కుమారి,గడ్డం.వెంకటేశ్వర్లు, బిక్షం,సిపిఐ మండల కార్యదర్శి వంగరి.సత్తిష్,విఓఏల సంఘం మండల అధ్యక్షురాలు ముత్యాల. రమాదేవి, కలం.సాంబమూర్తి,వెంకన్న,సురేష్, పాపారావు, సామ్రాజ్యం, సునీత పాల్గొన్నారు.









