నేటి గదర్, జూలై 16,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
తన దృష్టికి వచ్చిన హాస్టల్ విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్స్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం హాస్టల్ విద్యార్థుల సమస్యలను, బిసి హాస్టల్స్ బాయ్స్, గర్ల్స్ భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల వార్డెన్స్ నూతన విద్యార్థులకు భోజన ఏర్పాటు చేయడం కొరకు అప్రూవల్ కావాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ను కోరారు. విషయం పూర్తిగా తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే వారికి అప్రూవల్ గా ఇవ్వడంతో హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యాయని సదరు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిసి గురుకులం హాస్టల్స్ ABCDWO పి.విజయలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి.నరసింహారావు, అరుణ, జి.నరసింహారావు, అపర్ణ పాల్గొన్నారు









