నేటి గదర్ న్యూస్,పినపాక:
పినపాక మండలం దుగినే పల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 సహాయంతో మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ దంపతులు వివరాలు తెలియవలసి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు.
Post Views: 93









