రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు రైస్ మిల్లులలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందం మండలంలోని సాయి గీత రైస్ మిల్లులో రికార్డులు పరిశీలించి తనిఖీ చేశారు.అనంతరం రైస్ మిల్లులోని గోదాంలో ఉన్న ధాన్యం నిల్వలను వారు పరిశీలించారు.ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యము రికార్డు లెక్కలను సరిచూచారు.గోదాంలో ఉన్న సిఎంఆర్ ను పరిశీలించి క్షుణ్ణంగా పూర్తిస్థాయిలో అధికారులకు నివేదికను అందజేస్తామన్నారు.ఈ తనిఖీల్లో జిల్లా సివిల్ సప్లై అధికారి డిఎం.కొండలరావు, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి రాజేశ్వరి, మండల తహసిల్దార్ రజనీకుమారి స్పెషల్ టాస్కు ఫోర్స్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
Post Views: 586









