నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :
ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామం పాలెం ప్రాజెక్టు రహదారి పరిధిలో ప్రభుత్వ నిషేధిత గంజాయి ను ఇద్దరు వ్యక్తులు విక్రయిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సుర్జో లక్ష్మణ్, తక్రి నరేష్, గాంధీనగర్ గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వ్యక్తుల వ్యక్తుల నుండి 1,26,975 రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, ఎస్సై తిరుపతిరావు తెలిపారు.
వెంకటాపురం మండలం ఏజెన్సీ ప్రాంతంలో యువత గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్లు ఈ ఘటన ను చూస్తే అర్థమవుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈజీ మనీ కోసం ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి క్రయ, విక్రయాలు చేస్తున్న ముఠాలను, అదుపు చేసేందుకు పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.









