★రెండవ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ కారం మధుకి వినతిపత్రం అందజేత
నేటి గదర్ కరకగూడెం:రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించి,వారిని పర్మినెంట్ చేసి పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయన మంగళవారం రెండవ ఏఎన్ఎం లు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వినతిపత్రం ద్వారా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కారం.మధుకి ఏఎన్ఎంలతో కలసి వినతిపత్రం అందజేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని ప్రభుత్వ ప్రధామిక ఆరోగ్య కెంద్రంలోని పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలు వేటనే పరిష్కరించాలని అన్నారు అలాగే గత సంవత్సరం ఆగస్టు నెలలో మా యూనియన్ తరుపున సమ్మె నిర్వహించగా చర్చలో భాగంగా ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యడమ లెదా గ్రాస్ జీతం ఇవ్వడం,పని ఒత్తిడి తగ్గించాలనేదనిపై ఒక్క కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది కాని నేటికి ఆ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది లేదు అన్నారు. సమ్మె విరమించి నాలుగు రోజులకే కొత్త యాప్ తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా గతం కంటె ఇప్పుడు ఇంకా పని ఒత్తిడి రెట్టింపు అయింది అన్నారు.గతంలో ఇచ్చిన హామిలను నెరవేర్చలని తెలంగాణ రాష్ట్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఉప కెంద్రంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లు ఈ నేల 18 వ తేదీన కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్పుల.ప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి వంగరి.సత్తిష్,ఏఎన్ఎం లు సుజాత,తదితరులు పాల్గొన్నారు.









