*ములుగు అభివృద్ధి ప్రదాత సీతక్క
*ముప్పై వేల కోట్లతో రైతు రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం…
*రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం…
*రైతు భరోసా కూడా ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్) జులై 16:
ములుగు జిల్లా కేంద్రంలో మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ విచ్చేసి ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క , నాలుగు వందల కోట్లతో ములుగు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ అంతర్గత రోడ్లు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మించుటకు, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటుకు, ప్రతి మండలంలో సంక్షేమ భవనాలు నిర్మించుటకు నిధులు తెచ్చిన సీతక్క , నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భముగా వంగ రవి యాదవ్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి మరియు ములుగు నియోజకవర్గంలోని అంతర్గత పి.ఆర్. ఆర్&బి రోడ్లు మంజూరు కోసం, ఏటూరునాగారం నందు బస్ డిపో ఏర్పాటుకు, అలాగే ప్రతి మండలం నందు సంక్షేమ భవనాల కోసం నాలుగు వందల కోట్ల కోసం శ్రమించి తెచ్చిన సీతక్క కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సుకై ముఖ్యంగా సుమారు 30 వేల కోట్లతో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, జిల్లా కార్యదర్శి యాసం రవికుమార్, ములుగు మండల ప్రధాన కార్యదర్శి నల్లెల్ల భరత్ కుమార్, మండల బీసీ సెల్ అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, మైనార్టీ సెల్ ములుగు మండల అధ్యక్షుడు శకిల్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బోడ రఘు, ఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్, బీసీ సెల్ జిల్లా కోశాధికారి ఓడ రాజు, ములుగు మండల ఉపాధ్యక్షులు ఆర్షం రఘు, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు బోయినీ రాజుయాదవ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రేసోజు అభినవ్, జిల్లా నాయకులు జాఫర్ బాయ్, ధరావత్ సారయ్య, బిసి సెల్ మండల ప్రచార కార్యదర్శి బొంతల వేణు యాదవ్, మాదారపు రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.









