నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 17:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు సీఐ సతీష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
హిందువుల తొలి పండగ ఈ ఏకాదశి పర్వదినంతోనే పండగలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. తొలి ఏకాదశి శివయ్య కు అత్యంత ప్రీతికరమైన రోజు అని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మీ ఇంట్లో సుఖశాంతుల్ని నింపాలని,అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 332









