+91 95819 05907

నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం…

★నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ…

★సీఎస్ఆర్ పనులు,ఉపాధి అవకాశాలు కల్పించాలి…

★కాలక్రమ ప్రణాళికతో ముందుకు సాగాలి…

★ అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

నేటి బ్రదర్ న్యూస్ స్టేట్ బ్యూరో జూలై 17:
నైనారపు నాగేశ్వరరావు ✍️

సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్,సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్,స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి,జీఎం కో ఆర్డినేషన్ దేవేందర్ ఇతర అధికారులతో సుదీర్ఘ సమీక్ష చేసి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకుపై ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్,సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, ఇతర అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇటీవలనే ఆయన ఒడిశా రాష్ట్రంలో పర్యటించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో చర్చించారు.అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలతో,స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరాతో కలిసి సహకారాన్ని కోరారు.ఈ నేపథ్యంలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని,స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు.నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో,సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు,వాటి తొలగింపు,తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు.ఇందు కోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.ఏకైక నిర్వాసిత గ్రామ ప్రజలతో తాను,స్థానిక ఛెండిపడ ఎమ్మెల్యే అగస్తి బెహరా,స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించిన విధంగా స్థానికులకు పునరావాస పథకం, కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు,గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విధంగా జరపడా నుంచి ఛెండిపడ వరకు గల ప్రస్తుత రోడ్డును విస్తరించడం, బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టడంపై ఆ రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ సమన్వయం చేస్తూ త్వరితగతిని పనులు పూర్తి చేయడానికి చొరవ చూపాలని కోరారు.హై టెన్షన్ విద్యుత్తు లైను ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖతో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు. పునరావాస,నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్పిడిఏసి మీటింగ్ ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి ప్రారంభానికి ఇంకా పూర్తి కావలసి ఉన్న మరికొన్ని పనులపై కూడా ఆయన అంశాల వారీగా చర్చించారు.2015 లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్ ను కేటాయించినప్పటికీ గడచిన ప్రభుత్వ నిరాసక్తత వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని,అయితే సింగరేణి పై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక చొరవ కారణంగా తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అన్ని సమస్యల పరిష్కారానికి చర్చించడం జరిగిందన్నారు.నైనీ నుండి బొగ్గు ఉత్పత్తికి ఇప్పుడు పూర్తి సానుకూల పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో నిర్ణీత కాలక్రమ ప్రణాళికను రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.రోజు వారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ,బొగ్గు బ్లాకుపై ప్రత్యేక శ్రద్ధ చూపి మిగిలిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కు సింగరేణి సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సమావేశంలో సూచించిన ప్రకారం ప్రతి పనికి నిర్దేశిత కాలపరిమితిని విధించుకొని పూర్తి చేస్తామని,ఈ ఏడాది అక్టోబరు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !