★సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్రపల్లి సాంబ
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
పోడు భూముల్లో సాగు చేస్తున్న పోడు సాగుదారులకి పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులుసత్ర పల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బుధవారం ఆయన మణుగూరు మండలం లోని పెద్దపల్లి. పగిడేరు ఎస్టి కాలనీ విప్పల గుంపు సాంబయ్య గూడెం విజయనగరం కమలాపురం రాయగూడెం రేగుల గండి కూనవరం తదితర గ్రామాలలో సమావేశాలు నిర్వహించి, ఈ నెల 18 న భద్రాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించ తల పెట్టిన ధర్నాలు జయప్రదం చేయాలి కోరుతూ కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం హయాంలో విస్తీర్ణం తక్కువ పడిన వాటిని సరి చేయడానికి అవకాశం కల్పించాలని ,త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం ,సాగునీటి బోర్లు, వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్ , మంచినీరు, కరెంటు వంటి సౌకర్యాల కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని జిల్లా వ్యాప్తంగా టాక్టర్లతోభూములు దున్ను కోకుండా ఫారెస్ట్గా అధికారులు అడ్డుకుంటున్నారని ఇంటి స్థలం కోసం పోడుని ఎన్నో ఏళ్ల నుండి కాపాడుకుంటూ వచ్చి ఇల్లు వేసుకుంటే అధికారులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లం రాజు. నందం ఈశ్వరరావు. లెనిన్ బాబు నరసింహారావు ( kcr) మడి నరసింహారావు. మూసకి ఉంగయ్య. సోడి గంగయ్య కుంజ భీమయ్య తదితరులు పాల్గొన్నారు .









