+91 95819 05907

మిషన్ భగీరథ కార్మికుడు కామ్రేడ్ మద్దిబోయిన సంతోష్ కు విప్లవ జోహార్లు :IFTU

★మద్దిబోయిన సంతోష్ మరణం అత్యంత బాధాకరం , IFTU కార్మిక సంఘానికి తీరని లోటు

★మరణించిన కార్మికునీ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

★మృతి చెందిన సంతోష్ ఉద్యోగాన్ని ఆయన కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి

★చర్ల మిషన్ భగీరథ సూపర్వైజర్ అధికారికి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది

★తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కార్మిక సంఘం IFTU చర్ల మండల కమిటీ మరియు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్

నేటి గదర్ న్యూస్,చర్ల:

చర్ల మండలంలో R/w పంప్ హౌస్ వద్ద వాచ్మెన్ గా పనిచేసే మిషన్ భగీరథ కార్మికుడు మద్దిబోయిన సంతోష ఈరోజు మరణించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ IFTU , మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చర్ల మండలం మిషన్ భగీరథ కార్మికులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా IFTU భద్రాచల0 ఏరియా నాయకుడు కొండ చరణ్ , మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ భద్రాచలం డివిజన్ నాయకుడు మేడి సుందర్ మాట్లాడుతూ సంతోష్ మరణించడం ఎంతో బాధాకరమని ఆయన మరణం మిషన్ భగీరథ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు సంతోష్ అత్యంత స్నేహశీలు అని నిరంతరం అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని అన్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం మరణించిన మిషన్ భగీరథ కార్మికుడు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని అన్నారు మరణించిన కార్మికుని యొక్క ఉద్యోగాన్ని ఆ కార్మికుని కుటుంబం లో ఒకరికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మిషన్ భగీరథ కార్మికులు ఐక్యంగా ఉండాలని సంతోష్ కుటుంబానికి అండగా నిలబడాలని అన్నారు అనంతరం సంతోష్ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన చర్ల సూపర్వైజర్ అధికారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అధికారి సానుకూలంగా స్పందించి వీలైనంత మేరకు సంతోష్ కుటుంబానికి న్యాయం చేసే దానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, వినయ్, రాజేష్, కిరణ్, మరియు నాగరాజు ప్రశాంత్ పవన్ వెంకట్ అరుణ్ బాబు ప్రశాంతు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !