నీట మునిగి ఇండ్లు, అవస్థలుపడుతున్నా గ్రామస్తులు
నేటి గద్దర్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామపంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం కురిచినప్పుడల్ల రోడ్లు జలమయం అవుతున్నాయని, ఇళ్లలోకి వరద నీరు చేరుతున్నాయని దీనివల్ల గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని,గ్రామస్తులు వాపోతున్నారు.
రాత్రి పడిన భారీ వర్షానికి సుంకరి రాజారామ్ ఇల్లు పూర్తిగా జలమయం అయిందని, తలదాచుకోవడానికి చోటులేకుండా ఉందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాపోతున్నారు.అయ్యవారిపేట గ్రామం పంచాయతీ అధికారులు
సైడ్ కాలువలు తవ్వి నీళ్లు పోవడానికి మరమత్తులు చెయ్యాలని,గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. వర్షం కాలంలో ఇల్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నామని, దశాబ్దాల కాలం నుండి ఈ సమస్యను అనుభవిస్తున్నాం అని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి పరిష్కారం చూపడం లేదని ఇకనైనా తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.









