ITC లో అప్రెంటిస్లకు దరఖాస్తులు ఆహ్వానం
నేటి గదర్, జూలై 17,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీలో నెలకొని ఉన్న భద్రాచలం పేపర్ బోర్డ్ యూనిట్ ఐటిసి కర్మాగారంలో ఐటిఐ ఉత్తీర్ణత పొందిన వారు అప్రెంటిస్ నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం సర్కులర్ జారీ చేశారు. కాగా 2024-25 సంవత్సరానికి గాను ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషియన్, వెల్డర్, టర్నర్, COPA ట్రేడ్లతో యాక్టర్ అప్రెంటిస్ 1961 ప్రకారం దరఖాస్తులు కోరుతున్నట్లు వారు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతిలో 60 శాతం పైబడి మార్కులను సాధించి ఉండాలని, సంబంధిత ఐటిఐ ట్రేడ్లలో 75% పైబడి మార్కులు సాధించి ఉండాలని, వయస్సు 01/07/2024 నాటికి 21 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. పైన పేర్కొబడిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను, SSC సర్టిఫికెట్ (కాపీ), ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ (కాఫీ), అప్రెంటిస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం తో కూడిన దరఖాస్తును క్రింద అడ్రస్ కు పంపించాలని ప్రకటనలో పేర్కొన్నారు
address:
(M. VenkataRamaRao,
chief welfare officer,
ITC Ltd-PSPD, unit bhadrachalam,
sarapaka (Vill), Burgampahad (Mandal),
Bhadradri kothagudem (District),
Pincode: 507128)









