+91 95819 05907

ఆ బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం…

◆40 మంది ఖాతాదారులను మోసం చేసి 5 కోట్లు స్వాహా…

పోలీసులను ఆశ్రయించిన ఖాతాదారులు…

నేటి గదర్ న్యూస్, స్టేట్ బ్యూరో జూలై 17:
నైనారపు నాగేశ్వరరావు ✍️

నిజామాబాద్‌ జిల్లాలో యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఖాతాదారులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ అజయ్‌ పలువురు ఖాతాదారుల నుంచి భారీగా డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.దాదాపు 40 మంది ఖాతాదారులను మోసం చేసి వారి ఖాతాల నుంచి దాదాపు రూ.5 కోట్లు స్వాహా చేశాడు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.జిల్లా కేంద్రంలోని బడా బజార్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు రుణాల పేరుతో రూ.5 కోట్ల రూపాయాలు స్వాహా చేసాడు.సుమారు 40 మంది ఖాతాదారులకు బ్యాంక్ మేనేజర్ చేతిలో మోసపోయినట్టు బాదితులు తెలిపారు.ఇప్పటికే కొందరు బాధితులు 4 వ ఠాణా పోలీస్ స్టేషన్​లో బ్యాంక్ మేనేజర్​పై ఫిర్యాదు చేశారు.రుణాలు ఇచ్చేందుకు పలువురి వద్ద నుంచి మేనేజర్‌ అజయ్‌ బ్లాంక్‌ చెక్కులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.బ్లాంక్‌ చెక్కుల ఆధారంగా భారీగా డబ్బు డ్రా చేసుకున్నట్లు పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లోకి లోన్‌ నగదు బదిలీ కాగానే డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.గత రెండేళ్లుగా అజయ్‌ నిజామాబాద్‌లో పని చేస్తున్నాడని తెలుస్తోంది.ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 30 లక్షల వరకు టోకరా వేశాడని బాదితులు వాపోతున్నారు.బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్​పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వ్యాపార విస్తరణ నిమిత్తం బడా బజార్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్​ని కలిశాను,నా ఆస్తులను తనఖా పెట్టుకొని 50 శాతం లోన్ ఇచ్చారు.40 లక్షల రావాల్సి ఉండగా,కేవలం 20 లక్షల లోన్ ఇచ్చి మిగతా 20 లక్షలను మేనేజర్ తన ఖాతాలకు మళ్లించుకున్నారు.నాకు రావాల్సిన సీసీ లోన్స్ పూర్తిగా డ్రా చేశారు. బ్యాంక్​లో జరిగిన అక్రమాలపై ఆర్వోను సంప్రదించాను.వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఆర్వో చెప్పారు.వారం రోజులు గడిచినా స్పందించ లేదు.అందుకే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !