రామాయంపేట ( నేటి గదర్ ప్రతినిధి) జూలై 17:- రాష్ట్రంలో విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చాలన్న విషయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వాఖ్యాలకు స్పందించిన టిపిసిసి రాష్ట్ర అధికార అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ రామాయంపేటలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో రాష్ట్రంలో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రజలందరికీ వర్తింపచేయాలని జీరో బిల్లు దరఖాస్తులు తీసుకొని చాలామందికి వర్తింపజేయడం జరిగిందన్నారు.ఇప్పటికి కూడా ఈ సమస్య తీరకపోవడానికి కారణం విద్యుత్ లో ఉన్న టెక్నికల్ సమస్యలను చేసేందుకు ఏకంగా చైర్మన్ ను మార్చాలని మార్చడానికి సమయం పడుతుందని తప్పనిసరిగా ఈ సమస్య అందరికీ తీర్చి ఉచిత కరెంటు అందరికీ వచ్చేలా చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి లక్ష రూపాయల రుణమాఫీకి దఫాలుగా మాఫీ చేస్తూ వాటికి మళ్లీ మిత్తి చక్రవడ్డీ వేసి యధావధిగా లక్ష రూపాయల రుణాన్ని రైతుల ముందు ఉంచడం చాలా మంది రైతులు ఆత్మహత్యలకు కూడా అప్పటి ప్రభుత్వం కారణమైందని ఆయన ఆరోపించారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా నేడే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెల ముందు నెరవేరేస్తున్నారని ఆయన అన్నారు.దీనివల్ల రైతుల కన్నుల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయని రైతు ఆనందమే రాష్ట్రానికి పండుగని ఆయన అన్నారు.31 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం భారాన్ని మోసిన రైతులకు ఇచ్చిన మాట కోసం రుణమాఫీ చేస్తున్నదని ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు మాని ప్రజాక్షేమం కోసం పనిచేయాలని ఆయన కోరారు.