నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణలో రూ. లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నగదు విడుదల కానుంది. ఇప్పటికే నగదును ఆయా బ్యాంకులకు ఆర్థిక శాఖ జమ చేసింది. ఆగస్టు నెలాఖరు నాటికి 3 దశల్లో రుణమాఫీ కానుంది. ఈ నెలాఖరు లోపు రూ. 1.50 లక్షలు, ఆగస్టులో రూ. 2 లక్షలు చేయనున్నారు. నేడు గ్రామాలు, మండల కేంద్రాల్లో రుణమాఫీ సంబురాలు నిర్వహించనున్నారు.
Post Views: 89









